విశాఖపట్నం(Visakhapatnam) నుంచి పరిపాలనపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన విశాఖ నుంచి పాలనపై స్పష్టత ఇచ్చారు. జులై నెలలో విశాఖకు వెళ్తున్నామని.. అక్కడి నుంచే పరిపాలన చేస్తానని తెలిపారు. ఇప్పటికే విశాఖ నుంచే పాలన చేస్తానని జగన్ అనేక సందర్భాల్లో తెలిపారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలపైనా మంత్రులతో చర్చించారు సీఎం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని మంత్రులను ఆదేశించారు. మంత్రుల పనితీరును గమనిస్తున్నానని.. పనితీరు బాగోలేకపోతే మంత్రివర్గంలో మార్పులు చేస్తానని జగన్ హెచ్చరించారు.
Read Also: రైల్లో ప్రయాణికురాలిపై టీసీ మూత్రవిసర్జన
Follow us on: Youtube Instagram