30.7 C
Hyderabad
Tuesday, March 18, 2025
spot_img

పోసాని అరెస్ట్.. కూటమి సర్కారుపై వైసీపీ మాటల దాడి

పోసాని అరెస్ట్.. కూటమి సర్కారుపై వైసీపీ మాటల దాడి

సినీ నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణమురళి అరెస్టుతో వైసీపీ నేతలు కూటమి సర్కారుపై విమర్శల దాడి చేస్తున్నారు. కేవలం కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ వైసీపీ మద్దతుదారులపై అన్యాయంగా కేసులు పెడుతూ వేధిస్తోందని అంటున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎల్లకాలం కొనసాగవని ధ్వజమెత్తారు. పోసాని అరెస్టుతో ప్రభుత్వం అరాచకం తీవ్రస్థాయికి చేరినట్టైందని దుయ్యబట్టారు. కచ్చితంతా ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవద్దని పోలీసులను కోరుతున్నామని అన్నారు. పోసాని ఆరోగ్యానికి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

ఇక పోసాని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ప్రజాస్వామ్యంలో కక్ష రాజకీయాలు మంచివికావని సూచించారు. రాజకీయాలనుంచి దూరంగా వెళ్తున్నాని పోసాని ఎప్పుడో ప్రకటించారని.. అయినా ఆయనపై దుర్మార్గంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బ్రిటిష్‌ పాలనలో స్వేచ్ఛగా ఉన్నావేమోనన్న భావన ప్రజలకు వస్తోందని దుయ్యబట్టారు కన్నబాబు.

శివరాత్రిరోజునా చంద్రబాబు ప్రజలను హింసిస్తున్నారని మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపణలు చేశారు. పోసాని అరెస్టే దీనికి నిదర్శనమని అన్నారాయన. చంద్రబాబును ఎవ్వరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. పోసాని అనారోగ్యంతో ఉన్నా చంద్రబాబు వేధిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు బలిపశువులు కావొద్దని కోరుతున్నానని అన్నారు. చట్టాన్ని మీరితే ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అంబటి రాంబాబు హెచ్చరించారు.

పోసాని అరెస్ట్

వైసీపీ మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు రాయదుర్గంలోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీకి తరలిస్తున్నారు. కాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి.

పోసాని కృష్ణమురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కులాల పేరుతో దూషించడం..ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై కేసు నమోదైంది. దీంతో పోసానిని హైదరాబాద్ లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి సంబేపల్లి ఎస్సై.. హైదరాబాద్ లోని రాయదుర్గం చేరుకున్నారు. పోసానిని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట అడిషనల్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట..పోసానిని హాజరుపరిచే అవకాశం ఉంది.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్