స్వతంత్ర, వెబ్ డెస్క్: ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గుండెపోటుతో కన్నుమూశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేస్తున్న ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆయన మృతి చెందారు. కుసుమ జగదీష్ మృతి పట్ల సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. తెలంగాణ ఉద్యమంలో జగదీష్ చురుకైన పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.