తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అహంకారం, అసమర్ధ నిర్ణయాల వల్లే రాహుల్ గాంధీ ప్రధాని కాలేకపో యారని మోత్కు పల్లి నరసింహులు ఫైరయ్యారు. తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి మళ్లిందని రేవంత్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని మోత్కుపల్లి నిలదీశారు. ఇటీవలి వరకు ఎంపీగా కొనసాగిన మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణం ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జరుగుతున్నది పరిపాలన కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే అన్నారు. తెలంగాణలో కీలకమైన మాదిగ సామాజికవర్గాన్ని పక్కన పెట్టారని ఆయన తప్పు పట్టారు.