25.2 C
Hyderabad
Friday, February 14, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

గాలి వాన బీభత్సం

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలి వాన కురవడంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. సుమారు లక్ష యాబై వేల రూపాయల నష్టం వాటిల్లిందని… తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

పోలీసుల దాడులు

లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధి లాలాపేట్‌లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి వినయ్ అనే వ్యక్తి పడి మృతి చెందారు. సమాచారం తెలుసు కున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

శునకం.. ప్రదక్షిణం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. రాచర్ల గొల్లపల్లిలో నవ గ్రహాల వద్ద ఓ శునకం 11 ప్రదక్షిణలు చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది కాస్త అక్కడున్న వారు వీడియో తీసి పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.

అమానుష ఘటన

హనుమకొండ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కమలాపూర్ మండలం మర్రిపెల్లి గూడెం గ్రామానికి చెందిన జక్కుల మల్లమ్మ అనే వృద్ధురాలిని ఇద్దరు కొడుకులు ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తంచేసింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతుంది.

బాబా చూపిన మార్గంలో…

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌ మండలంలో పులాజీ బాబా ధ్యాన మందిరంలో భక్తులు ధ్యానం చేస్తూ దివ్యానుగ్రహం పొందారు. జిల్లా నుంచే కాకుండా పక్కా రాష్ట్రా నుంచి భక్తులు తరలివచ్చి… ఆయన చూపిన ధ్యాన మార్గంలో నడుస్తూ భక్తి శ్రద్దలతో ధ్యానం చేస్తుంటారు. అయితే అక్కడికి వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు లేవని తెలుపుతన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న నటుడు శివాజీ

తిరుమల శ్రీవారిని సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండ పంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాల అందిం చారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. అమరావతి, పోలవ రం ప్రాజెక్ట్ పూర్తికావాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు.

శ్రీవారిని దర్శించుకున్న ఏక్తాపూర్

తిరుమల శ్రీవారిని నిర్మాత ఏక్తాకపూర్ దర్శించుకున్నారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా.. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఏపీ పెన్షనర్స్‌ సంఘం

ఐదేళ్లుగా ఏపీని అరాచకపాలన కొనసాగిందని అన్నారు ఏపీ పెన్షనర్స్‌ సంఘం నేత పూర్ణచందర్రావు. దానికి చరమగీతం పాడారని తెలిపారు.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా కూటమికి మద్దతు గా ప్రజా క్షేత్రంలో ప్రచారం నిర్వహించామని తెలిపారు.

101 కొబ్బరికాయలు

ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించడంతో.. కడప జిల్లాని మాధవరంలోని గ్రామదేవత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కూటమి అభ్యర్థులు. గంగమ్మ తల్లికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

పట్టుకున్నారు…

మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలో ఛేదించారు బాలానగర్ పోలీసులు. బాలానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో పదేళ్ళ ఓ బాలుడు మిస్సింగ్ కలకలం రేపింది. సమాచారం అందుకున్న బాలానగర్ సీఐ నవీన్ కుమార్ వెంటనే స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలోనే బాలానగర్ పోలీసులు ఛేదించారు.

మర్యాదపూర్వకంగా….

పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజును జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయనతోపాటు బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, జనసేన నాయకులు ఉన్నారు.

Latest Articles

గుంటూరు జిల్లాలో GBS సిండ్రోమ్ కలకలం

ఉమ్మడి గుంటూరు జిల్లాలో GBS సిండ్రోమ్ కలకలం రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా ఏడు కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరో ఐదుగురు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్