బత్తిని కుటుంబం ఇచ్చే చేప ప్రసాదం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి ప్రజలు తరలివస్తున్నారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం ఇతర శ్వాస కోస సమస్యల నివారణ కోసం బత్తిని కుటుంబం ఇచ్చే చేప ప్రసాదం మీద నమ్మకంతో ప్రజలు హైదరాబాద్ కు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు సాగే చేప ప్రసాదం పంపిణీ కోసం ప్రజలు రెండు రోజుల ముందే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్నారు. జబ్బులు తగ్గుతాయాన్న నమ్మకంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేక పోవడంతో ఈ ప్రసాదం కోసం వస్తున్నామని ప్రజలంటున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేశామని బత్తిని సోదరులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు.