చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసి బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని, 5 కొత్త బస్సులను ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయని, 5 బస్సు లను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితిలో లేరని, శాఖల్లో ఏదైనా అవినీతి జరిగితే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


