ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. ఇవాళ్టి నుంచి పదకొండు రోజుల పాటు పవన్ ఈ దీక్షలో కొనసాగనున్నారు. సాత్వికాహారం తీసుకుంటూ ఆయన దీక్షను ఆచరిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. అసలేంటీ వారాహి దీక్ష అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో కొనసాగను న్నారు. దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. ఈ 11 రోజులు కేవలం పాలు, పండ్లు, మంచినీరు, ద్రవాహారం తీసుకుంటూ ఆయన దీక్ష చేయనున్నారు.
పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రథానికి కూడా వారాహి అనే పేరుపెట్టుకున్నారు. అలాగే ఎన్నికల ప్రచారానికి కూడా వారాహి విజయభేరి యాత్ర అనే నామ కరణం చేశారు. ఇక ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టడం, ఆ పార్టీ నేతలు పోటీ చేసిన అన్నిచోట్లా విజయం సాధించారు. మొత్తం 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సాధించిన జనసేన. ఏపీ అసెంబ్లీలో టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలోనే వైసీపీని కూడా అధిగమించింది. ఇక కూటమి ప్రభుత్వంలో చేరిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఆయన వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్నారు. వారాహి దేవిని దుర్గామాత స్వరూపంగా భావిస్తారు. దుర్గాదేవికి ఉన్న ఏడు రూపాలలో వారాహి మాతరూపం ఒకటి మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే రక్తబీజులు, అంధకాసురుడు వంటి రాక్షసులను సంహరించిన దేవతగానూ చెప్తుంచారు. మరికొన్ని గ్రంథాలలో లలితా పరమేశ్వరి దేవి సర్వసైన్యాధ్యక్షు రాలే వారాహి దేవతగా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడే వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడానికి కూడా కారణం ఉంది. వారాహి అమ్మవారి దీక్షను సాధారణంగా జ్యేష్టమాసం చివర్లో లేదా ఆషాడమాసం ప్రారంభంలో స్వీకరిస్తూ ఉంటారు. అలాగే ఈ ఏడాది వారాహి నవరాత్రులు జులై ఆరు నుంచి జులై 14వ తేదీ వరకూ కొనసాగ నున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు నిర్వహిస్తారు.