30.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

టీవీకే ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోం.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్‌( M. K. Stalin) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు, టీవీకే భవిష్యత్తు, సంక్షేమ పథకాల కొనసాగింపుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి.

స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళ వెట్రి కళగం(Tamilaga Vettri Kazhagam) (టీవీకే) ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని డీఎంకే అడ్డుకోదని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తే వారు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ముఖ్యమైనది. కొత్త ప్రభుత్వం ఏర్పాటును అడ్డుకుని మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఆలోచన మాకు లేదు.. అని ఆయన వ్యాఖ్యానించారు

అదే సమయంలో, డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొత్త ప్రభుత్వం కొనసాగించాలని స్టాలిన్ సూచించారు. ముఖ్యంగా మహిళల కోసం అమలు చేస్తున్న ఆర్థిక సహాయ పథకాలపై ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇవ్వడం ఆర్థికంగా కష్టమని, డీఎంకే అమలు చేస్తున్నట్లుగా రూ.1000 ఆర్థిక సాయం కొనసాగిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.

ఇక టీవీకే అధినేత విజయ్‌( Vijay) చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు తమిళనాడులో మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. విజయ్‌కు సీఎం పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో ఆయన అభిమానులు, నెటిజన్లు భారీ ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.

కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు జల్లికట్టు ప్రొటెస్ట్‌ (2017 Jallikattu protests) తరహాలో చెన్నైలోని మెరీనా బీచ్‌( Marina Beach) వద్ద భారీ నిరసనలు చేపట్టాలని పిలుపునిస్తున్నారు. “విజయ్‌కు న్యాయం చేయాలి”, “ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి” వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టులపై తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా పర్యవేక్షణ పెంచినట్లు సమాచారం. ముఖ్యంగా మెరీనా బీచ్ పరిసరాల్లో పరిస్థితిని గమనిస్తూ, ప్రజలను వదంతులు నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

Latest Articles

సుబేదారి పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై కేసు నమోదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సుబేదారి పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 504, 505 కింద కేసు నమోదు చేశారు. రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్