స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమలలో మరోసారి చిరుత సంచారం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. ఘాట్ రోడ్డులోని 56వ మలుపు వద్ద కనిపించింది. అప్రమత్తమైన అటవీ అధికారులు వాహనదారులను గుంపులుగా పంపిస్తున్నారు. చిరుతను దారి మళ్లించేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల అలిపిరి నడక దాడిలో ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే ఇప్పుడు చిరుత కనిపించింది. ఇటీవల కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన నాలుగేళ్ల కౌశిక్ ను చిరుత నోట కరిచి తీసుకెళ్లింది. పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద బాలుడిని విడిచిపెట్టింది. ఈ ఘటనలో బాలుడి చెవి వెనుక, తలపై గాయాలయ్యాయి.