కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. కార్యాలయంలో ముందుగా కుటుంబసమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రీభవన్ A- బ్లాక్ లోని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యాల యంలోకేంద్ర మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. అంతకు ముందు తెలంగాణ భవన్‌లో వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపానికి కిషన్ రెడ్డి నివాళులర్పించారు.