BACలో చర్చించకుండానే అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడం దారుణమన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి. లగచర్లలో రైతులను అక్రమం గా అరెస్టు చేయడంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. లగచర్ల రైతులు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. గుండె పోటు వచ్చిన హీరా నాయక్‌కు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకు వెళ్తారా అంటూ నిలదీశారు. యావత్ తెలంగాణ రైతులను అనుమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టూరిజం మీద కాదు.. లగచర్ల లో జరిగిన టెర్రర్ మీద చర్చ జరగాలని డిమాండ్ చేశారు.