పులుల దాడుల్లో మరణించిన వారికి 5లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. పులుల దాడిలో మరణించిన వారికి 20 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని మాజీ మంత్రి , ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండలిలో కోరారు. దీనిపై మాట్లాడిన మంత్రి కొండా సురేఖ .. ఇప్పటికే 5 లక్షల సాయం ఇస్తున్నామని తెలిపారు. అమ్రాబాద్‌లో చర్యల మాదిరిగా కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విద్య, ఉపాధి అవకాశాల దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని అన్నారు.