Site icon Swatantra Tv

పులుల దాడుల్లో మరణించిన వారికి రూ.5లక్షల ఆర్థిక సాయం – కొండా సురేఖ

పులుల దాడుల్లో మరణించిన వారికి 5లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. పులుల దాడిలో మరణించిన వారికి 20 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని మాజీ మంత్రి , ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ మండలిలో కోరారు. దీనిపై మాట్లాడిన మంత్రి కొండా సురేఖ .. ఇప్పటికే 5 లక్షల సాయం ఇస్తున్నామని తెలిపారు. అమ్రాబాద్‌లో చర్యల మాదిరిగా కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విద్య, ఉపాధి అవకాశాల దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని అన్నారు.

Exit mobile version