37.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

చంద్రయాన్-3 విజయవంతం కావాలంటూ.. చెంగాలమ్మ ఆలయంలో పూజలు

స్వతంత్ర వెబ్ డెస్క్: జాబిల్లి రహస్యాలను శోధించే క్రమంలో భారత్ చంద్రయాన్ పరంపరలో మూడో ప్రయోగానికి సిద్ధమైంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ కీలక ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం వేదికగా నిలుస్తోంది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కోసం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పూజలు నిర్వహించారు. సూళ్లూరుపేటలోని గ్రామ దేవత శ్రీ చెంగాళమ్మ దేవతకు సోమనాథ్ ప్రత్యేక పూజలు జరిపారు. రేపు (శుక్రవారం) చేపట్టనున్న చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావాలంటూ అమ్మవారిని ప్రార్థించారు. గురువారం మధ్యాహ్నం 1:05 నిముషాలకు చంద్రయాన్-3కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం (రేపు) మధ్యాహ్నం 2-35 గంటలకు చంద్రయాన్-3 రాకేట్ ప్రయోగం నిర్వహించనున్నారు. చంద్రయాన్-1, చంద్రయాన్-2లకు భిన్నంగా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో చంద్రయాన్-3 ప్రయోగం నిర్వహించనున్నారు.

అలాగే తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. శుక్రవారం చంద్రయాన్-3 రాకెట్‌ను నింగిలోకి ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రయోగం విజయవంతం కావాలని శ్రీనివాసుని మొక్కుకున్నారు. ఇస్రో డైరెక్టర్ ఏకే పాత్ర, వీరముక్తివేల్, కల్పన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాకెట్ నమూనాను స్వామివారి పాదాలవద్ద ఉంచి ఆశీర్వాదం పొందారు. శాస్త్రవేత్తలకు ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి.. తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్