తన నివాసం వద్ద జరిగిన ఉద్రిక్తతపై మోహన్‌బాబు మరోసారి స్పందించారు. ఆ ఘటనలో గాయపడిన జర్నలిస్ట్‌కు క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనను అధికారికంగా ప్రస్తావించడంపై విచారం వ్యక్తంచేస్తూ ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు.. వ్యక్తిగత కుటుంబ వివాదంగా మొదలై.. ఘర్షణకు దారితీసిందన్నారు.. ఈ ఘటనలో జర్నలిస్ట్ సోదరుడికి బాధ కలిగించినందుకు తనకు కూడా బాధగా ఉందని తెలిపారు. అతడికి, అతడి కుటుంబానికి కలిగిన బాధకు తాను తీవ్రంగా చింతిస్తున్నానని తెలిపారు.. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నానని… త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.