తనపై వస్తున్న ఆరోపణలకు దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించి ఓ వీడియో రిలీజ్ చేశారు. కేసులకు తానేమీ భయపడటం లేదని తెలిపారు. తాను పోస్టులు పెట్టినవారికి కాకుండా సంబంధం లేనివారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నానని.. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నట్లు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా వర్మపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు. రెండు రోజులుగా రాంగోపాల్ వర్మ కోసం పోలీసులు ఆరు బృందాలుగా గాలిస్తున్నారు. ఆర్జీవీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 9కేసులు నమోదయ్యాయి. తాను ఎక్కడికీ పారిపోలేదని రామ్ గోపాల్ వర్మ వీడియో విడుదల చేశారు.