37.2 C
Hyderabad
Wednesday, April 22, 2026
spot_img

నేనేమీ భయపడడం లేదు – రాంగోపాల్ వర్మ

తనపై వస్తున్న ఆరోపణలకు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించి ఓ వీడియో రిలీజ్ చేశారు. కేసులకు తానేమీ భయపడటం లేదని తెలిపారు. తాను పోస్టులు పెట్టినవారికి కాకుండా సంబంధం లేనివారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నానని.. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నట్లు తెలిపారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్‌ సమయంలో సీఎం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా వర్మపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్‌ చేసేందుకు యత్నిస్తున్నారు. రెండు రోజులుగా రాంగోపాల్ వర్మ కోసం పోలీసులు ఆరు బృందాలుగా గాలిస్తున్నారు. ఆర్జీవీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 9కేసులు నమోదయ్యాయి. తాను ఎక్కడికీ పారిపోలేదని రామ్‌ గోపాల్‌ వర్మ వీడియో విడుదల చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్