వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్ (అదిత్ అరుణ్) హీరోగా, హెబ్బాపటేల్, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా స్వాతి సినిమాస్ పతాకంపై సురేష్ దత్తి నిర్మిస్తున్న చిత్రం ‘టర్నింగ్ పాయింట్’. ఈ చిత్రానికి కుహన్ నాయుడు దర్శకుడు. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను వెర్సైటైల్ కథానాయకుడు అల్లరి నరేష్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ‘టర్నింగ్ పాయింట్ టీజర్ అందర్ని ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. ఈ చిత్రం కథానాయకుడు త్రిగుణ్ మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రంతో అతని కెరీర్‌కు కమర్షియల్ సక్సెస్‌తో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనుకుంటున్నాను. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించి, చిత్ర టీమ్ అందరికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ” క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న మా చిత్రం టీజర్‌ను నరేష్ ఆవిష్కరించడం సంతోషంగా వుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిగుణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. సినిమాలో యాక్షన్ ఏపిసోడ్స్ కూడా అలరించే విధంగా వుంటాయి. మర్డర్ మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ఎంగేజ్ చేస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి’ అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ” ఓ కొత్త పాయింట్‌తో కుహన్ నాయుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను నిర్మించాం. నేటి ప్రేక్షకులు కోరుకునే కొత్తదనంతో పాటు సస్పెన్స్ అంశాలు ఉంటాయి. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
త్రిగుణ్ (అదిత్ అరుణ్), హెబ్బా పటేల్, ఇషా చావ్లా, వర్షిణి, రాశి, చమ్మక్ చంద్ర, రంగస్థలం మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: రామకృష్ణ, మల్లేష్, ఎడిటర్: నాగిరెడ్డి, సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్, కెమెరా: గరుడ వేగ అంజి, లైన్ ప్రొడ్యూసర్: కుమార్ కోట, కో-ప్రోడ్యూసర్స్: నందిపాటి ఉదయభాను, ఎం.ఫణి భూషణ్ కుమార్, జీఆర్ మీనాక్షి, ప్రొడక్షన్ డిజైనర్: అలిజాల పాండు, ప్రొడక్షన్ మేనేజర్: రవి ఓలేటి, నిర్మాత: సురేష్ దత్తి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: కుహన్ నాయుడు.