18.7 C
Hyderabad
Monday, January 20, 2025
spot_img

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లలోకి డబ్బులు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద, ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతులకు 2,000 రూపాయల వాయిదాను ఇస్తుంది. ఈ మొత్తాన్ని ఏటా 6 వేల రూపాయలు ఇవ్వనున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 13వ విడత పంపగా, 14వ విడత ఇంకా రైతులకు అందలేదు. ఈ పథకంలోని 14వ విడత అర్హులైన రైతులకు మాత్రమే ఇస్తారు.  పన్ను చెల్లించే రైతులకు ఈ పథకం ప్రయోజనం ఉండదు.
ఇప్పుడు 14వ విడత డబ్బులు రావాల్సి ఉంది. ఈ డబ్బులు రేపు జూలై 27న బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. పిఎం కిసాన్ యోజన 8 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు గురువారం నాడు 2,000 రూపాయలు నేరుగా బదిలీ చేయనున్నారు ప్రధాని మోడీ. కాగా ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 14వ విడత డబ్బులు పొందాలని భావిస్తే.. కచ్చితంగా ఇకేవైసీ చేసుకోవాలి. లేదంటే డబ్బులు రావు. అందు వల్ల ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి. రేపు అకౌంట్లలోకి డబ్బులు పొందొచ్చు. లేదంటే డబ్బులు రాకపోవచ్చు.
eKYC ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలంటే.. – PM-KISAN అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇక్కడ కుడివైపున ఇచ్చిన EKYC ఎంపికపై క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. ఇప్పుడు సెర్చ్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్ కార్డుకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి.
14వ విడతగా బ్యాంకు ఖాతాలో 2 వేల రూపాయలు వస్తాయో లేదో తెలుసుకోవడానికి PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఇక్కడ ముందుగా ఫార్మర్ కార్నర్‌పై క్లిక్ చేయాలి. తర్వాత లబ్ధిదారుల జాబితాలో పేరును తనిఖీ చేయవచ్చు. భూమి వివరాలు e-KYC అయిందా లేదా తెలుస్తుంది. స్టేటస్‌పై అవును అని రాసి ఉంటే మీకు రూ.2,000 బదిలీ అవుతుందని అర్థం చేసుకోండి. అక్కడ ఏమి రాయకుంటే వాయిదా రాదని అర్థం చేసుకోండి.

Latest Articles

చందమామకు చెత్త కష్టాలు – అంతరిక్షంలో స్వచ్ఛ చంద్ర చేపట్టాల్సిందేనా..?

చెత్త పెరిగిపోతోంది బాబోయ్, నాయనోయ్...అంటూ గోలెత్తేస్తుంటే, క్లీన్ అండ్ గ్రీన్, హరిత హారం, శుభ్రతా, పరిశుభ్రతా, స్వచ్ఛ భారత్...ఇలా ఎన్నో విషయాలు చెప్పి, బుజ్జగించి, లాలించి ఆ చెత్తకు చెక్ పెట్టే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్