స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పేదలు పేదలుగానే ఉండాలని.. పెత్తనం తమ చేతుల్లోనే ఉండాలనే స్వభావం చంద్రబాబుదని మండిపడ్డారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. నయా పెత్తందార్ల కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్ల పేదలకు భూములు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు వెళ్లినప్పటికీ.. పేదలు, ప్రభుత్వ విధానమే గెలిచిందన్నారు. తమ హయాంలో 51 వేలకు పైగా మందికి శుక్రవారం ఇళ్ళ పట్టాలు ఇవ్వనున్నామని వివరించారు. వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఇళ్ళు కట్టించి ఇస్తుందని అన్నారు.