29.2 C
Hyderabad
Sunday, May 10, 2026
spot_img

మెగా కోడలు మెప్పించేనా..?

అందాల రాక్షసి మూవీతో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి సినిమాతోనే గుడ్ పర్ ఫార్మర్ అనిపించికుంది. ఆతర్వాత శ్రీరస్తు – శుభమస్తు, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలతో సక్సెస్ సాధించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇక వరుణ్ తేజ్ తో ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే.. పెళ్లి తర్వాత సతీ లీలావతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇది మెగా కోడలుకు తొలి పరీక్ష. మరి.. ఈ తొలి పరీక్షలో లావణ్య మెప్పించే అవకాశాలు ఉన్నాయా..? లేదా..?

లావణ్య పెళ్లి చేసుకున్నప్పటికీ.. నటనకు ఫుల్ స్టాప్ పెట్టలేదు.. తనకు నచ్చే కథలతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు వైవిధ్యమైన కథాంశంతో సతీ లీలావతి అనే సినిమాలో నటించింది. భీమిలి కబడ్డీ జట్టు చిత్రాన్ని తెరకెక్కించిన సత్య తాతినేని ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే.. మ్యారేజ్ తర్వాత లావణ్య నుంచి వస్తున్న మూవీ కావడంతో సతీ లీలావతి పై అంచనాలు ఉండడం… జనాల్లో ఆసక్తి ఉండడం ఖాయం. ఈ సినిమాని ఈ నెల 8న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా మెగా హీరోల్లో ఎవరో ఒకరు గెస్ట్ గా వస్తారు. వరుణ్ తేజ్ కి బరి మూవీ షూటింగ్లో గాయమైంది. అందుచేత షూటింగ్ పక్కనపెట్టి రెస్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి వరుణ్ ఈ ఈవెంట్ కి వచ్చే ఛాన్స్ లేదు. అయితే.. చిరంజీవి, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్.. ఇలా ఎవరో ఒకర్ని తీసుకొస్తారని టాక్ వినిపిస్తోంది. మెగా కోడలు అయిన తర్వాత లావణ్య నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కాబట్టి సక్సెస్ అవుతుందా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది. ఈ మూవీ ట్రైలర్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారనే ఫీలింగ్ కలిగించింది. అలాగే మెగా హీరోల సపోర్టు, అలాగే మెగా అభిమానుల సపోర్టు ఉంటుంది కాబట్టి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయనేది సినీవర్గాల్లో టాక్. ఈ మూవీ హిట్ట‌యితే.. మాత్రం లేడీ ఓరియెంటెడ్ స్టోరీలకు లావణ్య మంచి ఛాయిస్ అవుతుందని చెప్పచ్చు. మరి.. ఎలాంటి ఫలితం వస్తుందో తెలియాలంటే.. ఈ నెల 8 వరకు వెయిట్ చేయాల్సిందే.

Latest Articles

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ… మోదీతో రేవంత్ ప్రత్యేక భేటీ

హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక పరిణామాలకు రంగం సిద్ధమైంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi) హైదరాబాద్‌కు రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక వినతులు సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్