ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రి నిమ్మల రామ్మోహన్‌నాయుడు, పలువురు టీడీపీ ఎంపీలు గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా ఏపీలోని జాతీయ రహదారులపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అమరావతికి కనెక్టివిటీతోపాటు.. అమరావతి హైదరాబాద్ మధ్య ఎక్స్‌ప్రెస్‌వే పై చర్చించారు. ఇందుకు కావలసిన నిధులు మంజూరు చేయాలని గడ్కరీని కోరారు సీఎం చంద్రబాబు.