తెలంగాణలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. భానుడి భగభగలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈనేపథ్యంలో వాతావరణశాఖ మరో వార్నింగ్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఫిబ్రవరి మొదటివారం లో ప్రారంభమైన ఎండలు… సెగలు పుట్టిస్తున్నాయి. మధ్యాహ్నం రోడ్ల మీదకి వెళ్లాలంటే జనాలు భయప డుతున్నారు. మరో 2 నెలలపాటు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత పై మరింత సమాచారం మాప్రతినిధి విశాల్ అందిస్తారు.