ప్రధాని నరేంద్రమోదీ .. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో మెగార్యాలీతో పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరీ కూడా పాల్గొంటారు. దాదాపు దశాబ్దం తర్వాత మోదీ, జయంత్ చౌదరి వేదిక పంచుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం దివంగత ప్రధాని , జయంత్ చౌదరి తాత చౌదరి చరణ్ సింగ్ కు భారత రత్న ప్రకటించిన తర్వాత ఆర్ ఎల్డీ పార్టీ బీజేపీ కూటమిలో చేరింది. ముజఫర్ నగర్ లోక్ సభ స్థానంనుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యాన్ వాహనాలపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసరడంతో వివాదం చెలరేగింది. ఖటౌలీ పోలీసు స్టేషన్ పరిధిలోని మడ్కరింపూర్ గ్రామం మీదుగా మంత్రి బహిరంగ సభకు వెళ్తుండగా కారుపై దుండగులు రాళ్లు విసిరారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.