26.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

సోషియో ఫాంటసీ కథతో సరికొత్త సీరియల్

తెలుగు ప్రేక్షకుల వినోదానికి కేరాఫ్‌ అడ్రస్‌ జెమిని TV. ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో అద్భుతమైన సీరియల్స్‌ని మనకి అందించిన జెమిని TV ఇప్పుడు సరికొత్తగా భైరవి అనే మెగా సోషియో ఫాంటసీ సీరియల్‌ని మార్చి 18 నుంచి ప్రసారం చేయబోతుంది.

ఒక సంపన్న కుటుంబం. ఆ ఇంటి ఇలవేల్పు భైరవీదేవి, అందుకే ఆ ఇంట పుట్టిన ఏకైక ఆడపిల్లకు ఆ దేవి పేరే పెట్టుకుంది.. తల్లి శివగామి. కానీ ఆస్తి కోసం, ఆధిపత్యం కోసం ఆరేళ్ళ భైరవిని అంతం చేసేశాడు స్వయాన ఆమె చిన్నాన్న ఆది. ఆ తర్వాత శివగామిని పిచ్చిదాన్ని చేసి ప్రపంచాన్ని నమ్మించాడు, ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. ఒక్కో వ్యాపారంలో తన వాళ్ళని ఒక్కొక్కళ్ళనీ పాతుకుపోయేలా చేశాడు. కానీ అతను ఊహించని విధంగా చనిపోయిన భైరవి తిరిగి వచ్చింది. చనిపోయిన భైరవి ఎలా తిరిగి వచ్చింది… అది ఆ ఇంటి ఇలవేల్పు భైరవిదేవి మహత్యమా? లేక మరేదైనా మాయా? తిరిగి వచ్చిన భైరవిని ఆవహించి ఉన్నది అమ్మవారా, ఆత్మా? తనను తుదముట్టించి, తన తల్లిని పిచ్చివాళ్ళను చేసిన వాళ్ళపై భైరవి ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది, తన తల్లి జీవితాన్ని వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా సరిదిద్దింది? అనే ఆస్తికరమైన కథతో రాబోతోంది.

భైరవి సీరియల్‌లో ఆకాంక్ష గాంధీ, బేబీ రచన, భరద్వాజ్‌ కావ్యరెడ్డి, వణపొన్నప్ప, బసవరాజ్‌, రోహిత్‌, డాలీ, శిల్పా గౌడ, రోహిత్‌ నాయర్‌, తదితర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ నెల 18వ తేదీ సోమవారం రాత్రి 7 గంటల నుంచి జెమిని టీవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భైరవి సీరియల్‌ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందడంలో ఎలాంటి సందేహం లేదని జెమిని టీవి యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రోమో

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్