వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని రేపు ఉదయం 10.30గంటలకు విచారిస్తామని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఇవాళ సాయంత్రం 4గంటలకు ఆయనను విచారించాల్సి ఉండగా.. ముందస్తు బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ ఇంకా పూర్తి కానందున రేపు విచారిస్తామని చెప్పింది. మరోవైపు బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు పక్షాలు తమ వాదనలను బలంగా వినిపిస్తున్నాయి. దీంతో అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తుందో? రాదో? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.