బీఆర్ఎస్ నాయకులపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎవరి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మూడవసారి అధికారంలోకి రావాలన్న కేసీఆర్ కల నెరవేరదని ఈ సందర్భంగా తెలిపారు. తనపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తాను భయపడే వ్యక్తిని కాదని.. అవినీతి చేసి ఉంటే విచారణ చేసుకోండని సవాల్ విసిరారు. మరోవైపు పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆయనతో రాహుల్ గాంధీ టీం భేటీ అయింది. అయితే పొంగులేటి వారి ముందు కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. వాటికి ఒప్పుకుంటేనే కాంగ్రెస్ లో చేరతానని స్పష్టం చేసినట్లు సమాచారం.