రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు ఊరట లభించింది. బెంగుళూరు హైకోర్టు ఆమెకు స్టే ఇచ్చింది. గతేడాది బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన అనంతరం నటి హేమపై నమోదైన డ్రగ్స్ కేసులో ఆమెపై తదుపరి చర్యలపై హైకోర్టు స్టే విధించింది. తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని హేమ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను అక్కడి హైకోర్టు విచారించింది. విచారణపై స్టే కోరుతూ హేమ దాఖలు చేసిన ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్ ను అనుమతిస్తూ విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు స్టే ఇచ్చింది.
గత ఏడది మే నెలలో బెంగళూరు ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీలో హేమ పాల్గొని డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో హేమ రిమాండ్ కు వెళ్లారు. రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నారని నిరూపించే ఆధారాలు లేవని జస్టిస్ హేమంత్ చందన గౌడర్ అన్నారు.