అమరావతి: సమాచార మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఏసీబీ కేసులో బెయిల్ ఇవ్వాలని విజయ్ కుమార్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వంలో సాక్షి పత్రిక, ఛానల్‌కు లబ్ధి చేకూర్చారని ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయ్ కుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను అరెస్టు చేస్తారనే ఆందోళన ఉందని తెలిపారు. కోర్టు ఏ షరతు విధించినా కట్టుబడి ఉంటానని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో కోరారు.
ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.