నెదర్లాండ్స్‌కు చెందిన నరైన్ మెల్కుమ్జాన్ అనే మహిళా పైలట్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. గగనతలంలో విన్యాసం చేస్తుండగా, అకస్మాత్తుగా దాని పైకప్పు తెరచుకుంది. అటువంటి భయానక పరిస్థితుల్లోనూ అలాగే కొద్దిసేపు ప్రయాణించి, చివరకు సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రయాణంలో ఎటు వంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ పైలట్లకు సూచనలు చేశారు. విమానంతో విన్యాసాల శిక్షణలో భాగంగా తనది రెండో ప్రయాణం అని నరైన్ తెలిపింది. తాను నడుపుతోన్న ఎక్స్‌ట్రా 330ఎల్‌ఎక్స్ గాల్లో ఉండగానే దాని పైకప్పు తెరచుకుందని చెప్పింది. టేకాఫ్‌కు ముందు సరిగ్గా తనిఖీలు చేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదని తెలిపింది. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకో కుండానే శిక్షణకు వెళ్లడం కూడా తాను చేసిన మరో తప్పు అని ట్వీట్ చేసింది.


