గుంటూరు జిల్లా మంగళగిరిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖద్వారాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న నేపథ్యంలో.. ఓ దాత నిర్మించిన ఆలయ ముఖద్వారాన్ని లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. మంగళగిరిని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నారా లోకేష్.