వ్యాపార రంగాల్లో ఎప్పుడూ ముందుండే అల్లు కుటుంబం నుంచి అల్లు స్నేహారెడ్డి స్థాపించిన పికాబు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివాల్‌ను ఈ రోజు మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ ఫ్యామిలీ కార్నివాల్ గ్రాండ్ గా చేయడం కోసం పికాబు సంస్థ టాప్ స్టిచ్ సంస్థతో జతకట్టింది. ఈ కార్నివాల్ కి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్.. తన సతీమణి అల్లు స్నేహ రెడ్డికి, నాగు రెడ్డి, స్మిత రెడ్డికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘పుష్ప షూట్ మధ్యలో నుంచి వచ్చాను. ఈ ఫైర్ ఫ్లై కార్నివాల్ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అల్లు స్నేహ రెడ్డి, నాగు రెడ్డి, స్మిత రెడ్డికి అభినందనలు. ఈ కార్యక్రమాన్ని ఇంతగా సపోర్ట్ చేసిన మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.’’ అని తెలిపారు.


