23.7 C
Hyderabad
Tuesday, February 27, 2024
spot_img

భారీ స్కెచ్ రెడీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ

 

గ్రేటర్ హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం రచిస్తుందా? ఎంబీటీ, కాంగ్రెస్ మధ్య దోస్తీ చిగురించబోతోందా? అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేని ఎంబీటీ వల్ల కాంగ్రెస్‌కు కలిగే లాభం ఏంటి? ఇండియా కూటమిలో ఎంబీటీని భాగం చేసి హైదరాబాద్‌ ఎంపీ బరిలో నిలుపుతారా? హైదరాబాద్ సీటును కాంగ్రెస్ త్యాగం చేస్తుందా? అసలు కాంగ్రెస్ నాయకత్వం ఆలోచన ఏంటి? వాచ్ దిస్ స్టోరీ..

గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీలోని ఒక భాగంలో బలంగా ఉన్న మజ్లిస్ పార్టీ తొలినుంచీ అధికార పార్టీలతో సన్నిహితంగా ఉంటూ వస్తోంది. అయితే ఉమ్మడి రాష్ట్ర ఆఖరు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమయంలో వివిధ కారణాలతో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌కు దూరంగా జరిగింది. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతిస్తూ వచ్చారు. గత పదేళ్ల నుండి మజ్లిస్ బీఆర్ఎస్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సైతం మజ్లిస్ మా మిత్రపక్షం అని పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముస్లింల కోసం తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని, కేసీఆర్ తో మా దోస్తీ కొనసాగుతూనే ఉంటుందని ఎంఐఎం అగ్రనేతలు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మజ్లిస్ మాత్రం బీఆర్ఎస్ తోనే ఉన్నట్టు కనిపిస్తోంది.

గ్రేటర్‌ సిటీ పరిధిలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్‌ పార్టీ నగరంలో మజ్లిస్ దూకుడుకి అడ్డుకట్ట వేయాలని డిసైడైంది. మజ్లిస్ ప్రాబల్యం తగ్గడానికి ఏం చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ నేతలు ఆలోచన చేస్తున్నారు. మజ్లిస్ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న ఎంబీటీతో స్నేహంగా ఉండాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్, ఏంబీటీ మధ్య చర్చలు జరిగాయి. ఏఐసీసీ నుండి ప్రతినిధిగా ఉన్న దీపాదాస్ మున్షీ ఏంబీటీ నేతలతో చర్చలు జరిపారు. అయితే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదు. లోక్‌సభ ఎన్నికలు రానుండటంతో ఏంబీటీని ఇండియా కూటమిలో భాగం చేసే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందట. ఎంబీటీ కూడా ఇందుకు సిద్ధం గా ఉందని టాక్ నడుస్తోంది.

హైదరాబాద్ లో ఎంబీటీ ప్రోగ్రెసివ్ పార్టీగా మొదలైంది. గతంలో ఎంబీటీకి నలుగురు ఎమ్మేల్యేలు ఉండగా, మజ్లిస్ పార్టీకి కేవలం ఒకే ఒక్క ఎమ్మేల్యే ఉండేవాడు. ఎంబీటీ అధ్యక్షుడు అమానుల్లా ఖాన్ చనిపోయిన తర్వాత ఏంబీటీ ప్రాబల్యం తగ్గి మజ్లిస్ తిరుగులేని పార్టీగా ఎదిగింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏంబీటీ కాస్త ఆక్టివ్ అయింది. యాకత్ పురా నుండి పోటీ చేసిన ఎంబీటీ అభ్యర్థి అంజిద్‌ ఉల్లా ఖాన్ మజ్లిస్ పార్టీని దాదాపు ఓడించినంత పని చేశారు. కేవలం 900 ఓట్ల తేడాతోనే మజ్లిస్ అభ్యర్థి గెలుపొందారు. దీంతో తమ పార్టీ ఎదుగుదలకు ఇదే మంచి అవకాశం అని ఎంబీటీ భావిస్తోంది.

నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కు నిరాశ ఎదురైంది. ఈ ఓటమిలో ముస్లిం ఓటు బ్యాంక్ కూడా కారణం అని కాంగ్రెస్ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఒకప్పుుడు మిత్ర పక్షంగా నిలిచిన మజ్లిస్ పార్టీ.. ఇప్పుడు పూర్తి స్థాయి శత్రు పక్షంగా మారిపోయింది. దీంతో మజ్లిస్ కు చెక్ పెట్టడం ద్వారానే నగరంలో పట్టు నిలుపుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ లో ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు ఇదే అవకాశంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎంబీటీని ఇండియా కూటమిలో భాగం చేసి హైదరాబాద్ ఎంపీ సీటును ఎంబీటీకి ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ టీ కాంగ్రెస్ లో జరుగుతోంది. ఈ వ్యూహం సాధ్యాసాధ్యాలపై సునీల్ టీం లోతుగా డిస్కషన్ చేస్తున్నదని టాక్. ఎంఐఎం ప్రాబల్యం తగ్గించాలనే కాంగ్రెస్ వ్యూహం ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి.

Latest Articles

‘ఆపరేషన్ వాలెంటైన్’ విజువల్ ఫీస్ట్ లా వుంటుంది – చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్