30.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

అటల్‌ సేతుపై తొలి ప్రమాదం

    ముంబయిలో నూతనంగా నిర్మించిన అటల్‌ సేతుపై తొలి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయా ణిస్తున్న ఇద్దరు మహిళలు సహా చిన్నారులు గాయపడ్డారు. ముంబయి నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని చిర్లేకు వెళుతున్న కారు అటల్‌ సేతుపైకి చేరుకోగానే.. ముందు వెళుతున్న మరో వాహనాన్ని దాటేందుకు యత్నించింది. దీంతో అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం తీవ్రత మరింత ఎక్కు వగా ఉంటే వాహనం సముద్రంలో పడేదని అక్కడి వారు తెలిపారు. ఈ ఘటన మొత్తం వంతెనపై వెళుతున్న మరో కారు డ్యాష్‌కామ్‌లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అటల్‌ సేతు ప్రారంభించిన తర్వాత ఇదే తొలి ప్రమాదమని అధికారులు తెలిపారు. గాయపడిన మహిళలు, చిన్నారులను ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Latest Articles

టీవీకే ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోం.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్‌( M. K. Stalin) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు, టీవీకే భవిష్యత్తు, సంక్షేమ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్