వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అంశంలో జగన్ వైఖరిని సొంత పార్టీ నేతలే తప్పుబడుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితం అయిన వైసీపీ.. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అడుగుతోంది. అయితే నిబంధనల ప్రకారం 10వ వంతు సీట్లు వచ్చిన పార్టీకే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఈ లెక్కన కనీసం 18 సీట్లు ఉంటే కానీ ప్రతిపక్ష హోదా లభించదు. కానీ 11 సీట్లకే ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేస్తున్న వైఎస్ జగన్. ఆ హోదా కనుక ఇవ్వకపోతే తాను అసలు అసెంబ్లీకే రానంటూ గతంలో శపథం చేసి సభ నుంచి వెళ్లిపోయారు.
అసెంబ్లీకి రానని ప్రతినిబూనిని వైఎస్ జగన్.. మళ్లీ ఏమనుకున్నారో కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. వరుసగా గైర్హాజరైతే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్టం రాజు గతంలోనే వ్యాఖ్యానించారు. అసలే తనపై పీకలదాకా కోపం పెంచుకున్న రఘురామ.. అన్నంత పని చేస్తాడని భావించి.. జగన్ సభకు వచ్చారనే టాక్ వినిపిస్తుంది. ఇంతకు వరకు బాగానే ఉన్నా.. 10 మంది ఎమ్మెల్యేలను వెంటేసుకొని వచ్చిన జగన్.. పట్టుమని పదినిమిషాలు కూడా సభలో లేరు. ఇలా వచ్చి సంతకాలు పెట్టి.. మళ్లీ వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామనంటూ వెళ్లిపోవడంపై కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
వైఎస్ జగన్ అలా వచ్చి.. ఇలా వెళ్లిపోవడం వెనుక కారణం ఏంటో ప్రజలకు తెలుసని కూటమి నేతలు అంటున్నారు. తన పదవిని కాపాడుకోవడం కోసమే ఇలా వచ్చి వెళ్లారని టీడీపీ విమర్శిస్తుంది. అయితే ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తామనడం ఏంటనే చర్చ కూడా జరుగుతుంది. వైసీపీ సభలో ఉంటే.. స్పీకర్ మైకు ఇస్తారు కదా? అప్పుడు ప్రజల సమస్యలు సభ దృష్టికి తేవొచ్చుకదా? మరి అలాంటి అవకాశాన్ని వైఎస్ జగన్ ఎందుకు వదులుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. ఒక వైపు శాసన మండలికి మాత్రం హాజరవుతూ.. అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఎందుకు డుమ్మా కొడుతున్నారు? అసలు జగన్ స్ట్రాటజీ ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతుంది. అధికారం పోయిన దగ్గర నుంచి జగన్‌లో అసహనం స్పష్టంగా కనపడుతుందని.. ఇలాంటి సమయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై జగన్‌కు అవగాహన లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తుంది.
ఒక వైపు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. సూపర్ సిక్స్‌తో పాటు అనేక హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఇలాంటి సమయంలో వైసీపీ ప్రజా సమస్యలపై ఆందోళన చేయడం వల్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. పైగా ఓడిపోయినా ప్రజల్లో ఉన్నారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ కేవలం ప్రతిపక్ష హోదా కోసం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఏంటని.. స్వయంగా వైసీపీ నాయకులు కూడా అంటున్నారు. కేవలం కూటమి పార్టీలు ఇచ్చిన హామీలకు ఆశపడే ప్రజలు ఓటేశారని జగన్ భావిస్తున్నారు. అంతే కానీ తన హయాంలో జరిగిన తప్పులను మాత్రం జగన్ గుర్తించడం లేదనే టాక్ వినిపిస్తుంది.
జగన్ వైఖరిలో మార్పు రాకపోతే మాత్రం.. వైసీపీకి మరిన్ని ఇబ్బందులు తప్పవనే టాక్ వినిపిస్తుంది. ప్రజల్లో ఉండాల్సిన నాయకులు.. కనీసం అసెంబ్లీకి కూడా హాజరు కాకపోవడం ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా సరే జగన్ మాత్రం తన మొండి పట్టుదలను వీడటం లేదని పార్టీలో చర్చ జరుగుతుంది. ఓడిపోయినా సరే జగన్ మంకు పట్టు వీడటం లేదని ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇదిలాగే కొనసాగితే కూటమి నేతల విమర్శలకు అవకాశం ఇచ్చినట్లే అనే టాక్ వినిపిస్తుంది. అసెంబ్లీకి వెళ్లకుండా.. ప్రజా సమస్యలున ప్రస్తావించకుండా.. రాబోయే రోజుల్లో ఏమని ఓట్లు అడుగుతారనే చర్చ జరుగుతుంది.
అసెంబ్లీ సమావేశాల గైర్హాజరీలో జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని.. అసలు సమావేశాలకు రాకుండా పోతే బానే ఉండేదని.. కానీ ఎమ్మెల్యే పదవి పోతుందేమో అనే అనుమానంతో ఒక సారి వచ్చిన సంతకాలు పెట్టి వెళ్లడం పెద్ద మైనస్ అనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ విషయంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అనేది చూడాలి.