స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్ నుంచి కడప జిల్లా పులివెందులకు చేరుకున్నారు వైయస్ అవినాష్ రెడ్డి. పులివెందుల సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో అవినాష్ రెడ్డి పాల్గొని.. ప్రజల నుండి వచ్చిన సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ ఉదయం వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరిస్తూ.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.