స్వతంత్ర, వెబ్ డెస్క్: టీడీపీ అధిష్టానానికి కేశినేని నాని పరోక్షంగా సవాల్ విసిరారు. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఏ పిట్టల దొరకు సీటిచ్చినా ఇబ్బంది లేదన్న నాని.. ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానేమో.. లేదా నా మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అని వెల్లడించారు. నా మాటల్ని పార్టీ ఎలా తీసుకున్నా నాకు భయం లేదన్నారు. పార్టీ టికెట్ ఇస్తుందా? నేను ఎంపీ అవుతానా? అనే భయం లేదన్నారు. నాకు ట్రాక్ రికార్డు ఉందన్న నాని.. నేను చేసినన్ని పనులు దేశంలో ఏ ఎంపీ కూడా చేయలేదని వ్యాఖ్యానించారు.