స్వతంత్ర, వెబ్ డెస్క్: వరుసగా గత నాలుగు రోజులుగా లాభాల్లో తేలిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 346.89 పాయింట్లు నష్టపోయి 62,622.24 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 99.45 పాయింట్ల నష్టంతో 18,534.40 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.73గా నిలిచింది. టీసీఎస్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, రిలయన్స్, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయిన జాబితాలో ఉండగా.. విప్రో, హెచ్‌సీఎల్, టైటాన్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభపడ్డ జాబితాలో ఉన్నాయి.