సీఎం జగన్ పై జరిగిన రాళ్లదాడిని ఖండిస్తూ.. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డుపై బైఠాయిం చారు. ఇది ముమ్మాటికి టీడీపీ పక్కా ప్లాన్‌తో చేసిందని, ఈ దాడుల వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ ఆరోపించారు. ఇలాంటి దాడులతో తమ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేరని, జగన్ బస్సు యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రతిప క్షాలు ఈవిధమైన దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.