Rajanna Sircilla |ఒకే కాన్పులో ఓ మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పీపుల్స్ హాస్పిటల్‌లో జరిగింది. గంభీరావు పేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టెముక్కుల లావణ్య, కిషన్ దంపతులకు ఇంతక ముందు ఒక సంతానం ఉన్నారు. 9 ఏండ్ల సుదీర్ఘ కాలం తర్వాత లావణ్యకు ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు పూర్తి ఆరోగ్యంతో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారని గైనకాలజీ విభాగాధిపతిరాలు డాక్టర్ అఖిల తెలిపారు. లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని… ఇలా జరిగినప్పుడు తల్లీ, బిడ్డలకు క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయని అన్నారు. కానీ డాక్టర్ల సమిష్టి కృషి వల్ల డెలివరీ ప్రశాంతంగా జరిగిందని వివరించారు.
Read Also: పేపర్ లీకేజీ ఘటన.. విచారణాధికారి ఆంధ్రోడే.. నిందితుడు ఆంధ్రోడే: రేవంత్ రెడ్డి
Follow us on: Youtube, Instagram, Google News