Revanth Reddy | టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో విచారణ అధికారి శ్రీనివాస్ ఆంధ్రోడు, నిందితుడు ప్రవీణ్ ఆంధ్రోడే అని విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ కేసులో కేటీఆర్ నే బాధ్యులుగా చేస్తూ నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నానని… భాగస్వాముల పంపకాల్లో వచ్చిన భేదాల వల్లే ఈ లీకేజి కేసు బయటికి వచ్చిందన్నారు. ఈ స్కామ్ లో పాత్రధారులు, సూత్రధారులను కాపాడేందుకే కేసీఆర్ సర్కారు ప్రయత్నిస్తోందన్నారు. విచారణాధికారి శ్రీనివాస్ ఆంధ్రోడు, నిందితుడు ప్రవీణ్ ఆంధ్రోడే అని అన్నారు.. మరి తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? అంటూ అని నిలదీశారు. ఈ కేసు విచారణని ఆంధ్రుల అధికారుల నుంచి తప్పించాలని.. మన రాష్ట్ర అధికారులతో మాత్రమే విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) డిమాండ్ చేశారు. కెసిఆర్ కు తెలంగాణ ఇష్టం లేకపోవచ్చు.. కానీ మాకు కష్టం కలిగించవద్దని అన్నారు. దోపిడీ దొంగతనం చేసిన కేటీఆర్ కు అధికారులు సమాచారం ఇస్తున్నారని.. ఇందులో కోట్ల రూపాయల కుంభకోణం, మనీలాండరింగ్ జరిగిందని అన్నారు.
Read Also: అసెంబ్లీ సెగ్మెంట్లకు బీజేపీ కన్వీనర్లను ప్రకటించిన బీజేపీ
Follow us on: Youtube, Instagram, Google News