స్వతంత్ర, వెబ్ డెస్క్: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతుంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే (బీఆర్ఎస్) దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపుల బాధితురాలు ఆత్మహత్యాయతనానికి పాల్పడింది. తెలంగాణ భవన్ పార్కింగ్ ఏరియాలో బాధితురాలు విషం తాగి ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.