27.2 C
Hyderabad
Wednesday, January 22, 2025
spot_img

ఎన్టీఆర్ చేయలేనిది.. కేసీఆర్ చేసి చూపిస్తరు: కేటీఆర్

స్వతంత్ర వెబ్ డెస్క్: తారకరామారావు పేరులోనే పవర్ ఉందన్నారు మంత్రి కేటీఆర్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎన్టీఆర్  ఆరాధ్య ధైవమన్నారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెల్వదని.. రాముడైనా..కృష్ణుడైనా తమకు ఎన్టీఆరేనన్నారు. ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై రూ.1.37 కోట్లతో  నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్‌ పార్క్‌ సహా విగ్రహాన్ని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ఎన్టీఆర్ విగ్రహం  ఆవిష్కరించే అవకాశం తనకు రావడం అదృష్టమన్నారు.   ఎన్టీఆర్ గొప్ప నాయకుడు, గొప్ప నటుడు.. ఎన్నో సాధించారని.. అయితే జీవితంలో  ఒకటి మాత్రం సాధించ లేకపోయారన్నారు.. అయితే ఆ అవకాశం ఆయన  శిష్యుడు కేసీఆర్ కు ఉందన్నారు. ఎన్టీఆర్ వరుసగా మూడు సార్లు సీఎం కాలేకపోయారని.. కేసీఆర్ కు ఖమ్మం ప్రజల ఆశీస్సులో హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందన్నారు.

కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి కర్ణాటక నుంచి వందల కోట్లు తెస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సొమ్ము తీసుకుని బీఆర్ఎస్ కు ఓటేయాలన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమి లేదన్నారు. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఎంతో ప్రగతి సాధించారని తెలిపారు..  వారంటీ లేని కాంగ్రెస్ హామీలకు గ్యారెంటీ ఉండదన్నారు.  కాంగ్రెస్ హయాంలో రైతులకు 6 గంటల కరెంట్ ఇవ్వలేదన్నారు.

Latest Articles

హైదరాబాద్‌లో హెచ్​సీఎల్ కొత్త టెక్ సెంటర్

ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్​సీఎల్ హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించనుంది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్