ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. కేసీఆర్ కుటుoబoపై వ్యతిరేకత కనిపిస్తోంది. అధికార మంత్రులు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి.. అందుకే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యం కలిగిన వారు. కేసీఆర్‌లా ఫామ్‌హౌజ్‌లో ఉండటానికి మోదీ తెలంగాణకు రావడం లేదు. వేల కోట్లు తెలంగాణ ప్రజా సంపద దోచుకున్న కేసీఆర్ కుటుoబానికి మోడీని విమర్శించే నైతిక హక్కు లేదు.
మోదీ అనేక అభివృద్ధి పనుల కోసం రాష్ట్రానికి వస్తుంటే కేసీఆర్‌కు రావడానికి సమయం ఉండదు. రాష్ట్రానికి ప్రధాని వస్తుంటే కలవడానికి సమయం లేదా?. కేసీఆర్ హాటావ్, తెలంగాణ బచావ్ అని ప్రజలు నినాదిస్తున్నారు. కేసీఆర్ తెచ్చిన పథకాల్ని పూర్తిగా వైఫల్యం చెందాయి. విద్య, వైద్యం పూర్తిగా కుంటు పడింది. ఆర్థిక వ్యవస్థ విఫలం అయ్యింది. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఅర్ఎస్‌కు ఓటేసినట్టే. కేసీఆర్ ఇంకా 90 రోజులే ప్రగతి భవన్‌లో ఉంటారు.
ఎలాగో గెలవరు కాబట్టి ఇష్టమొచ్చిన హామీలు ఇస్తుంది కాంగ్రెస్. ఆరు గ్యారెంటీలు కాదు అరవై గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ చరిత్ర దేశ ప్రజలకు తెలుసు.అరవై యేండ్లు దేశాన్ని పాలించారు. అడుగడుగున అవినీతితో దోచుకున్న కాంగ్రెస్ చరిత్ర ప్రజలకు తెలుసు. ప్రజలు ఆలోచించాలి. రేపు మోదీ పాలమూరు గడ్డపై అడుగు పెడుతున్నారు. ఘనంగా స్వాగతం పలకాలని ప్రజలను కోరుకుంటున్నాను. గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొనాలి. గంట సేపు మీమీ పరిసరాల్లో శ్రమ దానం చేయాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీలో చేరిన వారందరికీ శుభాకాంక్షలు. సొంత ఎజెండాతో కొన్ని మీడియా సంస్థలు రాతలు రాస్తున్నాయి. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయి. బీఅర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బీజేపీలోకి వస్తున్నారు. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదగబోతోంది. తెలంగాణ ప్రజలు అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు.