అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని ఎంపీ డీకే అరుణ అన్నారు. తాగునీటి సమస్యను తీర్చేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో ఆమె శంకుస్థాపన చేశారు. అభివృద్ధి కోసం పార్టీలు వేరైనా ఎమ్మెల్యేలతో కలిసి పని చేస్తామని డీకే అరుణ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్‌లోని అన్ని మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున కేంద్రం నిధులు విడుదల చేసిందన్నారు. మున్సిపాలిటీలో 24 గంటలు తాగునీరు అందించేందుకే అమృత్ 2.0 స్కీం కింద కేంద్ర నిధులు విడుదల చేస్తుందని.. షాద్ నగర్ మున్సిపాలిటీకి 27.50 కోట్ల నిధులు వచ్చాయని డీకే అరుణ తెలిపారు.