మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ చౌక్ వద్ద తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని ఘనంగా జరుపుకున్నారు, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యమ కాలమైనా, పరిపాలనా ప్రస్థానమైనా నిత్యం తెలంగాణనే శ్వాసించిన నేత కేసీఆర్,
రాష్ట్రం కోసం ఢిల్లీ గద్దెనే ఎదిరించి, ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసిన ధీశాలి!
ప్రజల కోసం పోరుగళమై గర్జించే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే నని అన్నారు, గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలను కష్ట సుఖాలను గుర్తెరిగి తోడై నిలిచిన కేసీఅర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో పట్టణ మండల అధ్యక్షులు పాదం శ్రీనివాస్, చుంచు చిన్నయ్య, మున్సిపల్ మాజీ వైస్ చేర్మెన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షులు అంకతి గంగాధర్ మరియు కార్యాకర్తలు పాల్గొన్నారు.