గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. బీఆర్ఎస్ పది సంవత్సరాల్లో ఇచ్చిన ఉద్యోగాలను.. కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లోనే ఇచ్చిందన్నారు. సిరిసిల్ల పట్టణంలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గత ప్రభుత్వం హయాంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులపై అనేక కేసులు పెట్టారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.