20.2 C
Hyderabad
Monday, January 20, 2025
spot_img

ప్రవళిక కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిచ్చి ఆదుకుంటాం- మంత్రి కేటీఆర్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇటీవల ప్రవళిక అనే యువతి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మొదటగా గ్రూప్-2 వాయిదా పడటం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం ప్రేమ వ్యవహారం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని చెప్పారు. అయితే తాజాగా ప్రవళిక తల్లిదండ్రులు.. తమ కుమార్తెను ఓ యువకుడు వేధించేవాడని.. అతడి వేధింపులు తట్టుకోలేక తాను బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే ప్రవళిక ఆత్మహత్యపై ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​లు తీవ్రంగా స్పందించాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. ఆమెది ఆత్మహత్య కాదని.. ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించాయి. మరోవైపు యువతి మరణాన్ని రాజకీయం చేయొద్దంటూ బీఆర్ఎస్ హితవు పలికింది. అయితే తాజాగా కరీంనగర్​లో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై స్పందించారు.

“ప్రవళిక మృతిని కూడా రాజకీయం చేశారు. ప్రవళిక కుటుంబసభ్యులు నా దగ్గరకు వచ్చారు.. న్యాయం చేయాలని కోరారు. ప్రవళిక కుటుంబాన్ని ఆదుకుంటాం. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తాం. అంతే కాకుండా ఆ అమ్మాయిని వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందుగా జాగ్రత్తపడతాం.” అని కేటీఆర్ తెలిపారు.

Latest Articles

చందమామకు చెత్త కష్టాలు – అంతరిక్షంలో స్వచ్ఛ చంద్ర చేపట్టాల్సిందేనా..?

చెత్త పెరిగిపోతోంది బాబోయ్, నాయనోయ్...అంటూ గోలెత్తేస్తుంటే, క్లీన్ అండ్ గ్రీన్, హరిత హారం, శుభ్రతా, పరిశుభ్రతా, స్వచ్ఛ భారత్...ఇలా ఎన్నో విషయాలు చెప్పి, బుజ్జగించి, లాలించి ఆ చెత్తకు చెక్ పెట్టే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్