Viveka Murder Case | ఏపీ మాజీమంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ల సీబీఐ కస్టడీ విచారణ రెండో రోజు ముగిసింది. విచారణ అనంతరం చంచల్ గూడ జైలుకు వీరిని తరలించారు సీబీఐ అధికారులు. వీరిరువురిని సుమారు ఏడు గంటల పాటు సీబీఐ విచారించినట్లు తెలుస్తోంది. మరోవైపు సీబీఐ కార్యాలయంలో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారిస్తుంది. విచారణలో పలు కీలక అంశాలను సేకరించినట్లు తెలుస్తోంది.